రాష్ట్రంలో ఇక అనాథలు ఉండరు

రాష్ట్రంలో ఇక అనాథలు ఉండరు

రాష్ట్రంలో ఇక అనాథలు ఉండరని... వారంతా ఈ రాష్ట్ర బిడ్డలన్నారు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్. హోమ్స్ లలో ఉండే పిల్లలకు అన్ని తానై ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీ అనాథ పిల్లల సంక్షేమానికి గొప్ప విధానం తీసుకుని రాబోతోందన్నారు. తల్లిదండ్రులకు దూరమై హోమ్స్ కు వచ్చే పిల్లలకు కుటుంబం ఏర్పడే వరకు ప్రభుత్వమే అండగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లోని సైదాబాద్, నింబోలి అడ్డా ప్రాంతాలలో బాల, బాలికల సదన్ భవనాలను మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ప్రారంభించారు. సెప్టెంబర్ 1 నుంచి అనాథల హోమ్స్ లో సన్న బియ్యం పెడతామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.