సమాజ నిర్మాణంలో మహిళ పాత్ర ఎనలేనిది: మంత్రి సత్యవతి

సమాజ నిర్మాణంలో మహిళ పాత్ర ఎనలేనిది: మంత్రి సత్యవతి

సమాజ నిర్మాణంలో మహిళ పాత్ర ఎనలేనిదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హన్మకొండలోని కేయు ఆడిటోరియంలో మహిళా దినోత్సవ సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. మహిళలు డాక్టర్ ప్రీతి లాగా ఆత్మహత్యలు చేసుకోవద్దని.. ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని మంత్రి సూచించారు గతంలో మహిళల సేవలకు అంతగా గుర్తింపు ఇవ్వ లేదు.. కానీ ఇప్పుడు మేము అందరి సేవలను గుర్తించి అవార్డులు ఇస్తున్నామన్నారు. కేసీఆర్ మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈరోజు నుంచే 'ఆరోగ్య మహిళ' అనే కార్యక్రమానికి కొత్తగా శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. 

ఈ పథకంలో భాగంగా 1200 పీహెచ్ సీలలో మహిళలకు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తామని.. అక్కడ అందుబాటులో లేని టెస్టులు హైదరాబాద్ లో అయినా చేయించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. అందరికి న్యూట్రిషన్ కిట్లు అందిస్తాం.. ఈ మేరకు సీఎం కేసీఆర్ బడ్జెట్ లో 250 కోట్లు కేటాయించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మాతా, శిశు మరణాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాల్య వివాహాలు నియంత్రించడంతో పాటు బాలికలకు ఉన్నత విద్యను అందించేందుకు గురుకులాలు ఏర్పాటు చేశామని అన్నారు. కేయూలో బాయ్స్, గర్ల్స్ కోసం ప్రత్యేక హాస్టళ్లకు 20 కోట్లు మంజూరు చేశామని,, వచ్చే ఏడాది మహిళా దినోత్సవానికల్లా భవన నిర్మాణాల పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.