బీఆర్ఎస్ పరిపాలనలో గిరిజనుల అభివృద్ధి : మంత్రి సత్యవతి రాథోడ్

బీఆర్ఎస్ పరిపాలనలో గిరిజనుల అభివృద్ధి : మంత్రి సత్యవతి రాథోడ్

ఇవాళ గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా అయ్యాయంటే దానికి కేసీఆరే కారణమన్నారు తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. గతంలో ఏ ప్రభుత్వం కూడా గిరిజనులను పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ పరిపాలనలో గిరిజనులకు చాలా అభివృద్ధి జరిగిందన్నారు. ఏనాడు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సేవాలాల్ మహారాజ్ గుర్తుకు రాలేదని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి నిర్వహిస్తోందన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీఆర్ఎస్ గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు ఏమీ చేయవని, కేవలం కేసీఆర్ మాత్రమే సంక్షేమం, అభివృద్ధి చేస్తారని చెప్పారు. నర్సాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే కేసీఆర్ ప్రభుత్వం మరోసారి రావాలన్నారు. నర్సాపూర్ లో సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉండాలి... మెదక్ ఎంపీగా మదన్ రెడ్డి ఉండాలన్నారు.