మేడారం జాతరను నేషనల్ ఫెస్టివల్గా గుర్తించాలి

మేడారం జాతరను నేషనల్ ఫెస్టివల్గా గుర్తించాలి
  • ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం
  • కేసీఆర్ రూ.332.71కోట్లు ఇస్తే.. కేంద్రం 2014 నుంచి పైసా ఇవ్వలేదు: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: మేడారం జాతరను.. నేషనల్ ఫెస్టివల్ గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు మంత్రి సత్యవతి రాథోడ్. మేడారం జాతరకు ఎంతో చరిత్ర ఉందని, ఐదారు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని తెలిపారు. మంత్రి సత్యవతి లేఖను జతపరుస్తూ ట్వీట్ చేశారు ఎంపీ కవిత. మేడారం జాతరకు జాతీయ హోదా తెచ్చి, ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీ సంజయ్ ని డిమాండ్ చేశారు కవిత. స్వరాష్ట్రంలో నాలుగు సార్లు వైభవంగా మేడారం జాతర జరిగిందని... కానీ కేంద్ర ప్రభుత్వం జాతరకు ఒక్క పైసా నిధులు ఇవ్వలేదన్నారు కవిత. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని TRS సర్కార్ అనేకసార్లు కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

తల్లి ఫోన్‌లో గేమ్ ఆడుతూ లక్షన్నరకు ఫర్నీచర్ ఆర్డర్

ఆటో డ్రైవర్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

రాపూరు అడవుల్లో 'పుష్ప' సినిమా తరహా సీన్