కుటుంబాన్ని పోషించే స్థాయికి మహిళలు ఎదగాలి : మంత్రి సీతక్క

కుటుంబాన్ని పోషించే స్థాయికి మహిళలు ఎదగాలి :  మంత్రి  సీతక్క

వెంకటాపూర్/ గోవిందరావుపేట, వెలుగు : ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగు కాంతులు వెళ్లి విరుస్తున్నాయని, మహిళా సాధికారతకు సమాఖ్య భవనాలు చిహ్నంగా ఉంటాయని, రాష్ట్రంలోని మహిళా సంఘాలు ఐక్యతకు ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయని మంత్రి  సీతక్క అన్నారు. 99 రోజుల ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క గురువారం వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

వెంకటాపూర్ లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక గ్రామసభకు హాజరయ్యారు. మండలానికి చెందిన 31 కల్యాణలక్ష్మీ లబ్ధిదారులకు  పంపిణీ చేశారు. వెంకటాపూర్ లో శెట్టి జయ - సదానందం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గృహప్రవేశానికి మంత్రి సీతక్క కలెక్టర్ దివాకరతో కలిసి హాజరయ్యారు. 

అనంతరం మహిళా సమాఖ్య భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. గోవిందరావుపేట మండలం చల్వాయిలోని లక్నవరం క్రాస్ వద్ద ఉన్నా కిచెన్ షెడ్ లో సీతక్క, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనిత రామచంద్రన్, కలెక్టర్ తో కలిసి అంగన్​వాడీ టీచర్లకు 5జీ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. అడిషనల్​ కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి తదితరులున్నారు.