మేడారం మహా జాతరలో ఉచిత వైద్య శిబిరాలు ప్రారంభం

మేడారం మహా జాతరలో ఉచిత వైద్య శిబిరాలు ప్రారంభం

తాడ్వాయి, వెలుగు : మేడారం మహా జాతరలో ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాలను మంత్రి సీతక్క సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఈ శిబిరంలో అందిస్తున్న సేవలు వినియోగించుకోవాలని సూచించారు. 

అనంతరం ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో మేడారం జాతరలో తుడుం దెబ్బ వలంటీర్స్ టీ షర్ట్స్ ను మంత్రి కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రాతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య శాఖ అధికారులు, వైద్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, పూజారులు, తుడుం దెబ్బ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.