తాడ్వాయి, వెలుగు: మేడారం మహాజాతర పనులను శుక్రవారం మంత్రి సీతక్క పరిశీలించారు. జాతర సమీపిస్తున్నందున భక్తుల రద్దీ పెరిగి జంపన్న వాగులో పుణ్య స్థానాలు ఆచరిస్తున్నారు. దీంతో స్నాన ఘట్టాలు, గదులు, స్నాన ఘట్టాల వద్ద బ్యాటరీ ఆప్ట్యాప్స్, ఇసుక లెవలింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అంతకుముందు కన్నెపల్లి సారలమ్మ ఆలయాన్ని సందర్శించి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆమె వెంట ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్ తదితరులున్నారు.
