మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలంలోని గోదావరి కరకట్ట రివీట్మెంట్ పనులను గురువారం పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ నాణ్యతతో త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరు రైతులను అడిగి తెలుసుకున్నారు. లారీలు ఆలస్యంగా వస్తున్నాయని తెలపడంతో ఆఫీసర్లకు ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
మండల కేంద్రంలోని అకినపెల్లి వెంకటేశ్వర్లు నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని పరిశీలించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పొదుమూరులో వడదెబ్బతో మృతిచెందిన జనగం లక్షయ్య కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మైల జయరాం రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శెట్టిపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
