మేడారం మహాజాతర సక్సెస్.. మంత్రి సీతక్క థ్యాంక్స్

  మేడారం మహాజాతర సక్సెస్.. మంత్రి సీతక్క థ్యాంక్స్

ఈ ఏడాది మేడారం మహాజాతర విజయవంతమైందని మంత్రి సీతక్క తెలిపారు. సుమారుగా కోటి 40 లక్షల మంది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను  దర్శించుకున్నారని చెప్పారు.  రేపు, ఎల్లు్ండి కూడా మేడారానికి భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. జాతర నిర్వహణ కోసం అత్యధికంగా కాంగ్రెస్ సర్కార్ నిధులిచ్చిందని చెప్పిన సీతక్క.  టార్గెట్ పెట్టుకుని మరి  పనులు వేగంగా పూర్తి చేశామన్నారు.  20 శాఖల అధికారులు నిత్యం పనిచేశారని తెలిపారు.  

ఆర్టీసీ ఆరు వేల బస్సులు అందించిందని...  10 వేల ట్రిప్పులను నడిపిందని మంత్రి సీతక్క చెప్పుకోచ్చారు.  ఈ సారి మేడారంలో ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూశామన్నారు.  జాతరలో 590 మంది తప్పిపోయారని..  30 మందిని గుర్తించలేకపోయామని వెల్లడించారు. జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి మంత్రి సీతక్క  ధన్యవాదాలు తెలిపారు.  సోమవారం నుంచి పారిశుద్ధ్య పనులు చేపడుతామని తెలిపారు. జాతరలో ఏమైనా లోపాలంటేమినీ మేడారం లోపు వాటిని సవరించుకంటామని మంత్రి సీతక్క చెప్పారు.