పెంపుడు మనుషులతో ఫేక్​ క్యాంపెయిన్: సీతక్క

పెంపుడు మనుషులతో ఫేక్​ క్యాంపెయిన్: సీతక్క

హైదరాబాద్: పెంపుడు మనుషులను పెట్టుకుని బీఆర్ఎస్ వాళ్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. తీన్మార్ మల్లన్నపై గత సర్కార్​తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి పంపిందన్నారు. ఆమె మాట్లాడుతూ ‘వందల కోట్లు ఖర్చుపెట్టి ఆరోజు నన్ను ఎమ్మెల్యేగా గెలవకుండా చేయాలని ప్రయత్నం చేశారు. ఈరోజు తీన్మార్ మల్లన్నపై కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నరు. ఆదివాసీ బిడ్డనైన నన్ను మంత్రిగా చూసి కొంతమంది ఓర్చుకోలేకపోతున్నరు. 

మొదటి విడతగా సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ప్రోత్సాహకంగా ప్రకటించాం. దొడ్డు వడ్లను కొనమని ఏ ఒక్క సందర్భంలో అనలేదు. తినడానికి ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం అందించడమే మా లక్ష్యం. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫస్ట్ తారీఖు రాగానే అందరికీ జీతాలు ఇస్తున్నం. రైతుల సమస్యలను, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నం’ అని సీతక్క తెలిపారు.