ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చా..మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి: మంత్రి సీతక్క

ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చా..మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి: మంత్రి సీతక్క

పురుషాధిక్య సమాజంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానన్నారు మంత్రి సీతక్క.  మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న సీతక్క.. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలన్నారు. పేదల సంక్షేమం కోసం పాటు పడుతున్నానని చెప్పారు.  ప్రజా సంక్షేమం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటానని చెప్పారు.  ప్రజలు గుర్తించిన వారే నిజమైన నాయకులన్నారు సీతక్క.  నాయకులకు ఆత్మపరిశీలన అవసరమని సూచించారు. అవకాశాలు రాని నాయకులు అసంతృప్తి చెందవద్దని చెప్పారు. ఒక్కోసారి ఒక్కొక్కరికి అవకాశాలు వస్తాయని.. కష్టపడిన వారికే అవకాశాలు వస్తాయన్నారు.  పార్టీ కోసం పాటు పడిన వారికే పెద్దపీట వేస్తామన్నారు.

 ఏజెన్సీలో ఇల్లు లేని వారందరికీ గృహాలు మంజూరు చేశానని చెప్పారు సీతక్క.  అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతి పక్షాలు కుట్రపన్నుతున్నాయన్నారు. బీఆర్ఎస్  కుట్రలను తిప్పికొట్టాలన్నారు. పార్టీ ప్రతిష్టకు పాటు పడి.. గ్రామ గ్రామాన పటిష్టం చేయాలని సూచించారు. పేదలకు  సంక్షేమ పథకాలు అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  ప్రజలు, పార్టీ, కార్యకర్తలే బలమే తన బలమన్నారు. ప్రజల మన్నలను పొందిన వారే ఉన్నత స్థాయి నేతలుగా ఎదుగుతారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు పార్టీ. కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు సీతక్క. 

ALSO READ : కేటీఆర్, కవితకే పంచాయితీ ఉంది.. : మంత్రి వివేక్ వెంకటస్వామి

అంతకు ముందు ములుగు జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో  సీతక్క  తన బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు.పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు.  అక్కడి పిల్లలతో కలిసి కాసేపు గడిపారు.