
బీఆర్ఎస్ లో కేటీఆర్, కవితకు మధ్యనే పంచాయితీ ఉన్నప్పుడు నియోజవర్గాల్లో పంచాయితీ సహజం అని అన్నారు మంత్రి వివేక్. అందర్నీ కలుపుకుపోయి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమంలో ప్రజల వినతులు స్వీకరించిన మంత్రి.. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి కొన్ని లైవ్ లోనే పరిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి గత బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు.
గత 10 ఏండ్లు మంత్రులతో ప్రజలు మాట్లాడే అవకాశం లేదని అన్నారు మంత్రి వివేక్. కానీ తమ ప్రభుత్వంలో ర్జాగా మంత్రులను కలిసే అవకాశం ఉందని చెప్పారు. బీఆరెస్ హాయాంలో పోలీసుల పహారా ఉండేదని.. కానీ తమ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎవ్వరిపైనా కేసులు కూడా పెట్టలేదని గుర్తు చేశారు. గత బీఆరెస్ ధర్నా చౌక్ ఎత్తివేసిందని కానీ తమ ప్రభుత్వం ధర్నాలకు అవకాశం ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పాలన అందిస్తుందని అన్నారు.
పాశమైలారం ఘటన జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారని.. కానీ గతంలో కొండ గట్టు ఘటన జరిగితే కేసీఆర్ పోయిన పాపాన పోలేదని విమర్శించారు. పాశమైలారం ఘటన వద్దకు సీఎం వెళ్లినా కూడాసీఎం వెళ్ళలేదని కేటీఆర్ ట్వీట్ చేయడంపై మంత్రి మండిపడ్డారు.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఇన్షియేటివ్ తో మంత్రులతో ముఖాముఖీ ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు. ప్రజాసమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే మంత్రితో ముఖాముఖి కార్యక్రమం అని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు జనంలో ఉండాలని సీఎం ఆదేశించారని చెప్పారు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే సుప్రీం అని అన్నారు మంత్రి వివేక్. ఇన్నాళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టత ఇచ్చారని తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జాయిన్ అయ్యి పార్టీ కోసం పనిచేసిన వారికి కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారని అన్నారు. పీసీసీ పదవులు.. పార్టీ పదవుల గురించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలిస్తు్న్నారని తెలిపారు. పాత, కొత్త విబేధాలు లేవనీ.. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.
►ALSO READ | బీఆర్ఎస్ స్వాధీనం చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లను తిరిగి ఇప్పిస్తా : బాధితులకు మంత్రి వివేక్ భరోసా
రేపటి (జులై 10) కేబినెట్ లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ గురించే చర్చ ఉంటుందని తెలిపారు మంత్రి వివేక్. గత కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు అమలు అవుతున్నాయో లేదో డిస్కషన్ ఉంటుందని అన్నారు. గిగ్ వర్కర్ల చట్టం గురించి ప్రిపరేషన్స్ నడుస్తున్నాయని.. గిగ్ వర్కర్స్ హక్కుల కోసం చర్యలు తీసుకుంటామని.. సీఎం సలహా మేరకు అసెంబ్లీలో పెట్టే అవకాశం ఉందని తెలిపారు.
సిగాచి .. 43 మంది చనిపోయిన ఘటనలో ఎంక్వైరీ చేయాల్సి ఉందని తెలిపారు. డిసెంబర్ లో ఇన్ స్పెక్టర్ రిపోర్టు ఇచ్చారు.. అందులో అన్నీ మెన్షన్ చేశారని చెప్పారు. కంపెనీ సూచనలు పాటించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని తెలిపారు. మేనేజ్మెంట్స్, ఫెడరేషన్స్ తో25 న మీటింగ్ ఉందని.. భవిష్యత్తులో ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఏం చేయాలో అక్కడ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.