ట్రైబల్ యూనివర్సిటీ పనులు స్పీడప్ చేయాలి : మంత్రి సీతక్క

ట్రైబల్ యూనివర్సిటీ పనులు స్పీడప్ చేయాలి : మంత్రి సీతక్క
  • ఎంపీలు బలరాం నాయక్, గోడం నగేశ్​తో కలిసి కాంపౌండ్​ వాల్ కు శంకుస్థాపన

ములుగు, వెలుగు: ములుగు సెంట్రల్​ ట్రైబల్​ యూనివర్సిటీ పనులు స్పీడప్​చేయాలని మంత్రి సీతక్క సూచించారు. ఆదివారం ములుగులోని గట్టమ్మ సమీపంలో యూనివర్సిటీకి కేటాయించిన 337ఎకరాల స్థలం చుట్టూ రూ.24 కోట్లతో నిర్మించనున్న 8.4 కిలోమీటర్ల కాంపౌండ్​వాల్​కు ఆదివారం ఆదిలాబాద్, మహబూబాబాద్​ ఎంపీలు గోడం నగేశ్, పోరిక బలరాం నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, కలెక్టర్​ దివాకర టీఎస్, వీసీ ఎల్  శ్రీనివాస్​తో కలిసి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కాంపౌండ్​ వాల్​ నిర్మాణం పూర్తి కాగానే, యూనివర్సిటీ బల్డింగ్​లకు ప్రధాని, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేస్తారన్నారు. యూనివర్సిటీ నిర్మాణం పూర్తయితే ములుగుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని తెలిపారు. ఎంపీలు బలరాం నాయక్, నగేశ్​ మాట్లాడుతూ కేంద్రం సహకరించేలా పార్లమెంట్​లో చర్చిస్తామని, రిజర్వేషన్  పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. లైబ్రరీ చైర్మన్  బానోత్​ రవిచందర్, ఏఎంసీ చైర్మన్​ రేగా కల్యాణి, నోడల్  ఆఫీసర్  వంశీ పాల్గొన్నారు.