V6 News

ఉపాధి హామీ బ‌‌‌‌‌‌‌‌కాయిల‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయాలి : మంత్రి సీత‌‌‌‌‌‌‌‌క్క

ఉపాధి హామీ బ‌‌‌‌‌‌‌‌కాయిల‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయాలి : మంత్రి సీత‌‌‌‌‌‌‌‌క్క
  •     కేంద్రానికి  మంత్రి సీత‌‌‌‌‌‌‌‌క్క విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి మంత్రి సీతక్క కోరారు. ఉపాధి హామీ పథకం అమలు, వీబీ జీ రామ్​జీ చట్టం అంశాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రాల మంత్రులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, కమిషనర్​ దివ్యా దేవరాజన్ పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రస్తుతం అమలవుతున్న ఉపాధి చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు. వీబీ జీ రామ్​జీ చట్టంపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకునేంత వరకు కొత్త చట్టం ప్రక్రియను వాయిదా వేయాలని సూచించారు. సీత‌‌‌‌‌‌‌‌క్క ప్రస్తావించిన అంశాలపై కేంద్రమంత్రి శివ‌‌‌‌‌‌‌‌రాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు .