- మంత్రి సీతక్క
కొత్తగూడ / పర్వతగిరి/ గీసుగొండ/ సంగెం/ వెలుగు : గ్రామాల అభివృద్ధికి అందరూ సహకరించాలని మంత్రి సీతక్క కోరారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ,గంగారం, వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో మంత్రి సీతక్క ఆదివారం పర్యటించారు. కొత్తగూడ ఐటీడీఏ గెస్ట్ హౌస్లో ఏటూరునాగారం ఐటీడీఏ కింద ముగ్గురికి కారుణ్య నియమాక పత్రాలు అందచేశారు. రెండు మండలాల కోసం ప్రత్యేకంగా డిగ్రీ కాలేజ్,30 పడకల అసుపత్రిని మంజారు చేసామన్నారు. అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వంతో వైల్డ్ లైఫ్ స్టేట్ బోర్డు మీటింగ్ పెట్టి పలు అనుమతులు కోరుతున్నామన్నారు.
కోనయమాకుల రైతు వేదికలో ఆదివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డితో కలిసి 58 మంది లబ్ధిదారులకు రూ.58 లక్షల కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, 46 మంది లబ్ధిదారులకు రూ. 16లక్షల 18వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, సంగెం మండలంలో 65 మంది లబ్ధిదారులకు రూ. 65 లక్షల విలువైన కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ , 48 మంది లబ్ధిదారులకు రూ.16 లక్షల 36 వేల విలువల సీఎం ఆర్ఎఫ్ చెక్కులను అందించారు.
గంగదేవిపల్లి గ్రామాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన కూసం రాజమౌళిని ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మంత్రి సీతక్క తెలిపారు. గీసుగొండ మండలం గంగదేవిపల్లిలో ఆదివారం బాలవికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డితో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజమౌళి మరణం గ్రామానికి తీరని లోటని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుదామన్నారు.
అంతకుముందు ప్రభుత్వ పాఠశాలలో రాజమౌళి పేరుతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ లాబ్ ను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో స్టేట్ రూరల్ డెవలప్మెంట్ డైరక్టర్ చల్లా నారాయణ రెడ్డి,కొత్తగూడ,గంగారం మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య,జాడీ వెంకటేశ్వర్లు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొగిలి,ఉపాధ్యక్షుడు కర్ర జనార్దన్ రెడ్డి,లీడర్లు రూప్సింగ్,లావణ్య వెంకన్న,వెల్దండి వేణు,రాజేశ్వర్రావు,రణధీర్ ,సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
