బీఆర్ఎస్ మాయమాటలు నమ్మి మోసపోకండి.. నిరుద్యోగులకు మంత్రి సీతక్క విజ్ఞప్తి

బీఆర్ఎస్ మాయమాటలు నమ్మి మోసపోకండి.. నిరుద్యోగులకు మంత్రి సీతక్క విజ్ఞప్తి

వరంగల్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా భవన్ కంచెలు తొలిగించామని.. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామని మంత్రి సీతక్క అన్నారు. పదేళ్లుగా వాయిదాలు పడుతున్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను మేం అధికారంలోకి రాగానే భర్తీ చేశామన్నారు. 15 వేల పోలీస్ ఉద్యోగాలు, 1,637 ఇంజినీరింగ్ పోస్టులు, 65 రోజుల్లోనే 11,067 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు. 10 ఏండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్కసారి డీఎస్సీ నిర్వహించలేదని.. పేపర్ లీకేజీలు చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని గులాబీ పార్టీపై ఫైర్ అయ్యారు.

Also Read :- గచ్చిబౌలి IIIT క్యాంపస్‌ చికెన్ బిర్యానిలో కప్ప

 బీఆర్ఎస్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా నిరుద్యోగులకు మంత్రి సీతక్క కీలక విజ్ఞప్తి చేశారు. ఆదివారం (అక్టోబర్ 20) హన్మకొండలో పర్యటించిన సీతక్క.. పోలోజు శ్రీహరి రచించిన రాష్ట్ర భక్తి గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ.. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి వారిని సన్మార్గంలో నడిపించే మార్గదర్శి గురువు అని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి బాధ్యత చూపే ఆదర్శమూర్తి ఉపాధ్యాయుడని.. తల్లిదండ్రులు కనిపెంచితే గురువులు పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి సన్మార్గంలో నడిపిస్తారని చెప్పారు. భాషోపాధ్యాయులకు పదోన్నతులిచ్చిన ప్రజా ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలని కోరారు.