గాంధీ భవన్‌‌‌‌లో మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు బర్త్‌‌‌‌ డే

గాంధీ భవన్‌‌‌‌లో మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు బర్త్‌‌‌‌ డే

హైదరాబాద్, వెలుగు: మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు పుట్టిన రోజు వేడుకలను గురువారం గాంధీ భవన్‌‌‌‌లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కాంతం మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్ బాబు నిండు నూరేండ్లు ఆరోగ్యంతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్నారు. వేడుకల్లో కోదండరెడ్డి , దేవని సతీశ్ మాదిగ, ఉట్ల వరప్రసాద్, ముప్పు భిక్షపతి, కుచనా రవళి, ఆనంద్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు