పరిగి, వెలుగు: పరిగిలో శనివారం జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు. శుక్రవారం పరిగి మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామ సమీపంలో సభా స్థలాన్ని ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.
పరిగి మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్లో పరిగి అభివృద్ధి ఎలా ఉండాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి ప్రణాళికతో నిధులు సమకూరుస్తారని చెప్పారు. మరోవైపు సీఎం సభకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.
