కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం : మంత్రి శ్రీధర్ బాబు

 కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం : మంత్రి శ్రీధర్ బాబు
  • మంత్రి శ్రీధర్ బాబు

మంథని, వెలుగు:  కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని, కష్టకాలంలో అండగా ఉన్న అన్నివర్గాలకు సమన్యాయం జరిగేలా చూస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు అన్నారు. మంగళవారం మంథని పట్టణంలోని ఓ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జయ్ కుమార్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు ఎంఎస్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పీసీసీ ప్రొటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు డీసీసీ నియామకం ఉంటుందన్నారు. 

పార్టీలో కష్టపడ్డ వారికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేయాలని ఆయన మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లీడర్లు కుడుదల వెంకన్న, శ్రీనివాస్, అయిలి ప్రసాద్, కాచే, తిరుపతియాదవ్, కిరణ్, సాయిగౌడ్, రాజేందర్, ప్రసాద్ పాల్గొన్నారు.