కేసీఆర్ జనరేటర్ తో సభలు పెట్టి కరెంట్ పోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి శ్రీధర్ బాబు

కేసీఆర్ జనరేటర్ తో సభలు పెట్టి కరెంట్ పోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. కేసీఆర్ జనరేటర్లతో సభలు పెట్టి.. కరెంట్ పోయిందంటూ దుష్ప్రచారం చేస్తు న్నారని అన్నారు.

ఎంజీఎంలో కరెంట్ పోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు..రికార్డు స్థాయిలో వినియోగం పెరిగినా విద్యుత్  సప్లయ్ చేశామన్నారు.  బీఆర్ ఎస్ పాలనలోనే ఎంజీఎం లో ఎలుకలు షేషంట్ల కాళ్లు కొరికిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. 

పరిపాలనను గాడిన పెట్టే పనిలో కాంగ్రెస్ ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన పొరపాట్లు మేం చేయకుండా ముందుకెళ్తున్నామన్నారు. మేడిగడ్డపై విపక్షాలను కూడా సలహాలు ఇవ్వాలని కోరామన్నారు.