కాళేశ్వరం భూసేకరణ కేసులో మంత్రి శ్రీధర్​బాబుకు ఊరట

కాళేశ్వరం భూసేకరణ కేసులో మంత్రి శ్రీధర్​బాబుకు ఊరట
  • 13 మందిపై నమోదైన కేసులను కొట్టేసిన నాంపల్లి కోర్టు 

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ సందర్భంగా నమోదైన కేసుల్లో మంత్రి శ్రీధర్‌‌బాబుకు ఊరట లభించింది. శ్రీధర్‌‌‌‌బాబు సహా మొత్తం 13 మందిపై నమోదైన కేసులను నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టు శనివారం కొట్టివేసింది. ఈ కేసులో ఎనిమిదేండ్ల పాటు కేసు విచారణ కొనసాగింది. చార్జిషీట్లలో పోలీసులు పేర్కొన్న అభియోగాలకు ప్రాసిక్యూషన్‌‌  సరైన సాక్ష్యాలు సమర్పించనందున కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ భూసేకరణ సమయంలో శ్రీధర్‌‌‌‌బాబు ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.  దీంతో 2017 ఆగస్టు 23న పెద్దపల్లి జిల్లా బసంత్‌‌నగర్‌‌ పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదైంది.