విద్యాకేంద్రంగా మంథని అభివృద్ధి : మంత్రి శ్రీధర్ బాబు

విద్యాకేంద్రంగా మంథని అభివృద్ధి : మంత్రి శ్రీధర్ బాబు
  • మంత్రి శ్రీధర్ బాబు

మంథని, వెలుగు: మంథని నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు అన్నారు. సోమవారం మంథని క్యాంపు ఆఫీస్‌‌‌‌లో రామగిరి, కమాన్‌‌‌‌పూర్, మంథని, ముత్తారం మండలాలకు చెందిన 87 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌, 38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి వారం నుంచి ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. 

సీఎం సహాయ నిధి నుంచి అందించే చెక్కులు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు అమలులో ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించే దిశగా ఐటీఐ కేంద్రాలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కాటారంలో రూ.35 కోట్లతో ఏటీసీని ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో  లీడర్లు అయిలి ప్రసాద్, కాచే, తిరుపతి యాదవ్, అరెల్లి కిరణ్‌‌‌‌, పాల్గొన్నారు. 

మృతుల కుటుంబాలకు మంత్రి పరామర్శ

మంథని మండల పరిధిలోని పలు బాధిత కుటుంబాలను మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు పరామర్శించారు. విలోచవరం గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాగం శ్రీనివాస్ తండ్రి రాగం సాంబయ్య ఇటీవల చనిపోగా.. వారి  కుటుంబాన్ని పరామర్శించారు. గద్దలపల్లి, ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన పలువురు బాధిత 
కుటుంబాలను పరామర్శించారు.