మెరియో సీఈవోతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

మెరియో సీఈవోతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

హైదరాబాద్, వెలుగు :  ఫ్రెంచ్ కు చెందిన మెరియో కంపెనీ సీఈవో రెమి ప్లెనెట్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శుక్రవారం పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సెక్రటేరియెట్ లో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ కు చెందిన హెచ్‌సీ రోబోటిక్స్ తో కలిసి ఈ సంస్థ ఆర్మీ కోసం అధునాతన గింబాల్స్ తయారు చేసేందుకు రూపొందించిన ప్రణాళికను  మంత్రికి వివరించారు.

దేశంలో మొదటి సారిగా ఏర్పాటు చేయబోతున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన తోడ్పాటు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సంస్థ ప్రతినిధులు వెంకట్ చుండి, రాధా కిషోర్, మాథ్యూ డెస్కోర్స్, నోయెమీ లాన్సియన్ తదితరులు ఉన్నారు.