యంగెస్ట్​ స్టేట్​ తెలంగాణ ఆహ్వానం పలుకుతున్నది: మంత్రి శ్రీధర్​ బాబు

యంగెస్ట్​ స్టేట్​ తెలంగాణ ఆహ్వానం పలుకుతున్నది: మంత్రి శ్రీధర్​ బాబు

హైదరాబాద్, వెలుగు: మన దేశంలో ప్రముఖ సంస్థ టెస్లా పెట్టుబడులు పెడుతుందన్న కథనాలతో వివిధ రాష్ట్రాలు ఆ సంస్థ కోసం ప్రయత్నాలను ప్రారంభించాయి. తెలంగాణ కూడా టెస్లాను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా ఉందన్న విషయాన్ని టెస్లా కంపెనీ ప్రతినిధులకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నది. 

ఆ సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఐటీ ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు ఇదివరకే ప్రకటించారు. అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాజాగా, త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీతో పెట్టుబడులపై చర్చించేందుకు ఇండియాకు వస్తున్నానని టెస్లా సీఈవో ఎలన్​ మస్క్​ ప్రకటించడంతో మంత్రి శ్రీధర్​ బాబు మరోసారి స్పందించారు. ఎలన్​ మస్క్​ను ట్విట్టర్​లో ట్యాగ్​ చేస్తూ గురువారం ఓ పోస్ట్​ పెట్టారు. ‘‘ఇండియాలో అత్యంత యంగ్ స్టేట్ అయిన తెలంగాణ మిమ్మల్ని ఇండియాకు సాదరంగా ఆహ్వానిస్తున్నది’’ అని పేర్కొన్నారు.