TRS వల్లే లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నడు

TRS వల్లే లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నడు

టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీసీ అనుకూల విధానాలు ఉండబట్టే లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నడని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన… అద్భుతమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో కాంగ్రెస్, బీజేపీలు బిత్తరపోయి చూస్తున్నాయని చెప్పారు. బీసీ, అణగారిన వర్గాలకు 30 వేల కోట్ల రూపాయలకు పైగా కేటాయించామని తెలిపారు. మంచిని మంచి అనే స్థితి లో ప్రతి పక్షాలు లేవని అన్నారు. కాంగ్రెస్ ,బీజేపీ లు దేశం లో ఇన్నేళ్లు అధికారం లో ఉన్నా కేంద్రం లో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేక పోయారని చెప్పారు.

కెసిఆర్ బీసీ లకు మరో జ్యోతి రావు పూలేనని అన్నారు శ్రీనివాస్ గౌడ్. పనులు చేసే వ్యక్తులను విమర్శించడం తగదని అన్నారు.. కేసీఆర్ గణనీయంగా మెస్ చార్జీలు పెంచడం తో బీసీ విద్యార్థులు లాభ పడ్డారని చెప్పారు. తెలంగాణ లో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసింది కేసీఆర్, ktr లేనని.. వారిని విమర్శిస్తే ప్రతిపక్షాలకు పుట్టగతులు ఉండవని అన్నారు