సురవరం ప్రతాప్ రెడ్డి సేవలు మరువలేనివి

సురవరం ప్రతాప్ రెడ్డి సేవలు మరువలేనివి

హైదరాబాద్: గోల్కొండ పత్రిక ద్వారా ప్రజల్ని చైతన్యవంతం మహనీయుడు సురువరం ప్రతాప్ రెడ్డి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. సురవరం ప్రతాప్ రెడ్డి 126 జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూల మాల వేసి నివాళి అర్పించారు.  ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ... పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, పండితుడు, రచయిత, ప్రేరకుడు, ఉద్యమకారుడిగా సురవరం ప్రతాప్ రెడ్డి బహుముఖ ప్రతిభ కనబరిచారని తెలిపారు. సురవరం ప్రతాప్ రెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.

తెలంగాణపై జరుగుతున్న అన్యాయాన్ని ఆయన గొంతెత్తి ప్రశ్నించారని చెప్పారు. ఆనాటి పాలకులకు ఏమాత్రం భయపడకుండా ప్రజల పక్షాన కొట్లాడిన గొప్ప వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అని మంత్రి పొగిడారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి, పుష్పలత, కపిల్, అనిల్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, ఎస్వీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తల కోసం...

రైతులకు శాపంగా మారిన ధరణి వెబ్ సైట్ 

బస్తర్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నాం