కేసీఆర్ కృషితో తెలంగాణకు పర్యాటకుల సంఖ్య పెరిగింది : మంత్రి శ్రీనివాస్ గౌడ్

కేసీఆర్ కృషితో తెలంగాణకు పర్యాటకుల సంఖ్య పెరిగింది : మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : 1970 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. సెప్టెంబర్ 25 నుండి 27 వరకు మూడు రోజులు శిల్పకళావేదికలో వేడుకలు నిర్వహిస్తామని తెలియజేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అందరూ ఆహ్వానితులేనని, ప్రవేశం ఉచితంగా ఉంటుందన్నారు. ఈ సంవత్సరం గ్రీన్ ఇన్వెస్ట్ మెంట్ థీమ్ తో నిర్వహిస్తున్నామని తెలిపారు. టూరిజాన్ని ప్రోత్సహిస్తున్న రెస్టారెంట్ హోటల్ ఇండస్ట్రీ నిర్వాహకులకు అవార్డులు ఇస్తామన్నారు. పర్యాటక రంగం వల్లే ప్రపంచ దేశాలకు గుర్తింపు వస్తుందన్నారు. పర్యాటకం అభివృద్ధి చెందితే ఆ దేశానికి ఎంతో గుర్తింపు వస్తుందన్నారు.  ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలపై బేగంపేట టూరిజం ప్లాజాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, టూరిజం కమిషనర్ నిఖిల, ఎండీ మనోహర్ పాల్గొన్నారు. 

కృత్రిమంగా క్రియేట్ చేసి కొన్ని దేశాలు ఉపాధి పొందుతున్నాయని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణకు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉందని, అద్భుతమైన సంపద మన వద్ద ఉందన్నారు. అన్ని ఉన్నా గతంలో అనుకున్నంత డెవలప్ జరగలేదన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల తొమ్మిదిన్నర ఏళ్ల నుండి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతోందని చెప్పారు. టెంపుల్ టూరిజం పెరిగిందన్నారు. రామప్పకు యునెస్కో వచ్చిందని, రెండు, మూడు సంవత్సరాలలో బాగా టూరిజం పెరిగిందన్నారు. తెలంగాణకు ఫారెన్ టూరిస్టుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. తెలంగాణలో చూడదగ్గ ప్రదేశాలు, ఇక్కడ చరిత్ర నచ్చితేనే విదేశీ టూరిస్టులు వస్తారని చెప్పారు. 

విదేశీ టూరిస్టులను ఆకట్టుకోవడంలో రాష్ట్రప్రభుత్వం, అధికారుల కృషి ఎంతో ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బుద్దిస్టుల చరిత్ర తెలంగాణలో ఉందన్నారు. శ్రీలంకకు వెళ్తే ఆ దేశ ప్రధాని కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను కొనియాడారని చెప్పారు. బుద్ధవనం, ఫణిగిరి, నెలకొండపల్లి ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భారతదేశంలో అతిపెద్ద ఏకోపార్క్ మహబూబ్ నగర్ లో అభివృద్ధి చేస్తామన్నారు. మహబూబ్ నగర్ లో జంగల్ సఫారీ టూరిజం కూడా తెచ్చేలా ప్లాన్ చేస్తున్నామని వివరించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి 50 నిమిషాలు మాత్రమే అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఒక్క రోజుల హైదరాబాద్ లో మూడు రోజులు వేడుకలు ఉంటాయన్నారు. 

37 క్యాటగిరీలుగా అవార్డులు ఇస్తున్నామని తెలిపారు. జిల్లా హెడ్ క్వర్టర్ లో లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శిల్పకళావేదికలో మూడు రోజుల పాటు వేడుకలు ఉంటాయన్నారు. టూరిస్టులను ఆకట్టుకునేలా కార్యాచరణ రూపొందించామన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్ గా నిలపాలని సీఎం కేసీఆర్ తపన పడుతుంటారని చెప్పారు.