రాములోరి కళ్యాణానికి హెలికాప్టర్ సేవలు !

రాములోరి కళ్యాణానికి హెలికాప్టర్ సేవలు !

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికై హెలికాప్టర్ సేవలను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మరికొన్ని రోజుల్లో శ్రీ రాముని కళ్యాణం జరుగనున్న నేపథ్యంలో.. మేడారం జాతరకు ఏర్పాటు చేసినట్లుగానే,  సీఎంతో మాట్లాడి భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవానికి కూడా ..హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెస్తామని గురువారం శాసనమండలి సమావేశాల్లో చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వరంగల్ ను టూరిస్ట్ సర్క్యూట్ గా అభివృద్ది చేస్తామన్నారు. త్వరలోనే రామప్పకు యునెస్కో గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. పర్యాటక ప్రదేశాల అభివృద్దిలో నిర్లక్ష్యం లేదని..రామప్ప ఐలాండ్ ను అందంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను పర్యాటకపరంగా అభివృద్ది చేస్తున్నామన్నారు.