కేసీఆర్ను టచ్ చేసేవాడు ప్రపంచంలోనే లేడు

V6 Velugu Posted on Jan 19, 2022

సీఎం కేసీఆర్ను టచ్ చేస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు దేశమంతా అల్లకల్లోలం అవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కేసీఆర్ మీద నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, ఆయనను జైలులో పెడితే సహించేదిలేదని, జైలు గోడలు బద్ధలు కొట్టేస్తామని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలోని MS ఫంక్షన్ హాలులో టీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశాన్ని గడగడలాడించి తెలంగాణ తెచ్చుకున్నామని, ఆ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ ను తాకేవాడు ప్రపంచంలోనే ఎవడూ లేడన్నారు. పాలమూరు జిల్లాకు  70 ఏండ్లుగా పాలకులు మోసం చేశారని ఆయన మండిపడ్డారు. అభివృద్దిలో కలసి వస్తే ప్రతిపక్షాల సలహాలు సైతం స్వీకరిస్తామని, ఇంకా పాతికేండ్ల పాటు అధికారం టీఆర్ఎస్ పార్టీదేనని మంత్రి చెప్పారు. దశల వారీగా పార్టీలో కార్యకర్తలకు పదవులొస్తాయని, అందరూ చైతన్యవంతంగా ఉండి.. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం..

జైలులో ఫోన్ మింగేసిన ఖైదీ.. నోటి ద్వారానే బయటకు తీసిన డాక్టర్లు!

20వేలు ఇస్తేనే భూమి నీ పేరిట రాసిస్తా..

ఏపీలో 10వేలు దాటిన కరోనా కేసులు..

Tagged Bjp, TRS, Telangana, CM KCR, minister srinivas gowd

Latest Videos

Subscribe Now

More News