బిగ్ న్యూస్ : బ్రహ్మానందం ప్రచారం చేసిన మంత్రి సుధాకర్ ఓటమి

బిగ్ న్యూస్ : బ్రహ్మానందం ప్రచారం చేసిన మంత్రి సుధాకర్ ఓటమి

తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రచారం చేసిన బీజేపీ మంత్రి సుధాకర్ ఓడిపోయారు. ప్రస్తుతం సుధాకర్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన బీజేపీ తరపున చిక్ బల్లాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ చేతిలో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి సుధాకర్ కు నటుడు బ్రహ్మానందం స్నేహితుడు కావటంతో.. నాలుగు రోజులపాటు ఆయన నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. అయినా ఫలితం లేదు. గత ఎన్నికల్లో మాత్రం గెలుపు వరించింది. ఇదే స్ట్రాటజీని రిపీట్ చేసినా.. బ్రహ్మానందం ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. 

చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు అధికంగా ఉన్నారు. బ్రహ్మానందం తెలుగు బాషలోనే పంచ్ లు పేల్చారు.. కామెడీ చేశారు.. ఓటర్లను ఆకర్షించారు. అయినా సుధాకర్ కు ఓటమి తప్పలేదు.