AP:PRC వ్యతిరేక ఆందోళనలపై స్పందించిన మంత్రి

AP:PRC వ్యతిరేక ఆందోళనలపై స్పందించిన మంత్రి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై స్పందించారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.  అప్పుడు పీఆర్సీని అంగీకరించి..ఇప్పుడు ఆందోళనలు చేయడం సరికాదన్నారు మంత్రి. గుంటూరులో సీఎం జగన్ తో జరిగిన భేటీలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడం కరెక్ట్ కాదన్నారు. ఉద్యోగులకు ఇంకా ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చన్నారు. 
స్కూళ్లకు సెలవులిచ్చే ఆలోచనేలేదు
కరోనా కేసులు విజృంభిస్తున్నప్పటికీ కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని.. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని.. అందుకే రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచనే చేయడం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు. కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందన్నారు. విద్యా సంస్థల్లోనే కాదు.. రాష్ట్ర మంతటా కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని.. ప్రభుత్వం తగిన ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. 

 

 

ఇవి కూడా చదవండి

సమాజాన్ని ఎదిరించి.. ఫైన్ కట్టి కూతురిని చదివించింది

ఎమ్మెల్యేను తరిమికొట్టిన గ్రామస్థులు

డిటర్జెంట్ పేరుతో లక్షల్లో నగదు తరలింపు