తెలంగాణ వస్తే ఏదీ జరగదన్నారు: మంత్రి తలసాని

తెలంగాణ వస్తే ఏదీ జరగదన్నారు: మంత్రి తలసాని

జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లే పనిలోపడ్డారు. ఆ ప్రయత్నంలో భాగంగా పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ ఆర్డీవో కార్యాలయంలో 157 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత ఏం అభివృద్ధి జరుగుతుంది అన్నారు.. కానీ, ఇప్పుడు ఏం జరుగుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు అని మంత్రి తలసాని అన్నారు.

‘సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత మేనమామ పథకం కింద పేదింటి అమ్మాయికి పెళ్లి కానుకగా లక్షా పదహారు వేలు కట్నకానుకల కింద ఇచ్చి ఆదుకుంటున్నారు. అలాగే వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నారు. రైతుబంధు, రూపాయి ఖర్చు లేకుండా ఎల్ఆర్ఎస్, బతుకమ్మ చీరలు, డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్ల లాంటి అనేక పథకాలను పేద ప్రజలకు అందిస్తున్నారు’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

For More News..

ఫార్మసిటీ వద్దంటూ కుర్చీలు విసిరి నిరసన తెలిపిన రైతులు

బాబ్రీ కేసులో అందరూ నిర్ధోషులే

ఏపీ కావాలనే కయ్యం పెట్టుకుంటుంది: సీఎం కేసీఆర్