నీళ్లున్న చోటంతా చేప పిల్లల పెంపకం చేపట్టాలి

నీళ్లున్న చోటంతా చేప పిల్లల పెంపకం చేపట్టాలి
  • మత్స్యకారులకు చేప పిల్లలు ఉచితంగా ఇస్తున్నాం
  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మేడ్చల్ జిల్లా: చెరువుల్లో 365 రోజులు నీళ్లు ఉండే విధంగా సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించారని.. కాబట్టి నీళ్లున్న చోటంతా చేప పిల్లల పెంపంకం చేపట్టి ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. గతంలో మాదిరిగా కాకుండా తమ ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు అందిస్తోందని ఆయన తెలిపారు. బుధవారం షామీర్ పేట్ చెరువు లో చేప పిల్లల పెంపకాన్ని మంత్రి మల్లారెడ్డి  తో కలసి ఆయన ప్రారంభించారు. 
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కుల వృత్తులు ఆర్థిక పరిస్థితి మెరుగు పడితే గ్రామం అభివృద్ధి చెందుతుందని, అదే విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎక్కడ నీళ్లు ఉంటే  అక్కడ చేపలు ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని ఆయన పేర్కొన్నారు.  ఒక్కపుడు సమాఖ్యల పద్ధతి ఉండేదని, ఇప్పుడు ఫ్రీ గా చేపపిల్లలను ఇస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు. మత్స్యకారులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.