కాంగ్రెస్​, బీజేపీలను నమ్మొద్దు.. తలసాని

కాంగ్రెస్​, బీజేపీలను నమ్మొద్దు.. తలసాని

పద్మారావునగర్/సికింద్రాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో మాయమాటలతో వచ్చే కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను నమ్మి మోసపోవద్దని సనత్ నగర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం బన్సీలాల్​పేట డివిజన్​లోని భోలక్​పూర్‌‌‌‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 

ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ మేకలమండి ప్రభుత్వ పాఠశాల వరకు ప్రచారం కొనసాగించారు. అమీర్​పేటలోని అతిథి హోటల్‌‌లో సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా మిలాప్​లో మంత్రి తలసాని పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేసిన మంత్రికి  మద్దతు ప్రకటిస్తున్నట్లు సిక్కు సమాజ్ ప్రతినిధులు తెలిపారు.