చేప పిల్లలు పంపిణి చేసిన మంత్రి తలసాని

చేప పిల్లలు పంపిణి చేసిన మంత్రి తలసాని

బీజేపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. ప్రధాని ఫోటో మీద కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఆమె హోదాకు తగ్గట్టు మాట్లాడాలన్నారు. ఆర్ధిక మంత్రి అయి ఉండి బొమ్మల గురించి రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రాజెక్టులపై కావాలనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 

జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ రిజర్వాయర్ లో చేప పిల్లల పంపిణి కార్యక్రమాన్ని తలసాని ప్రారంభించారు. స్టేష‌న్‌‌ఘ‌న్‌‌పూ‌ర్‌లోని పల్లెగుట్ట వద్ద ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి ఘన్‌‌పూర్‌ రిజ‌ర్వా‌య‌ర్‌లో 3 లక్షల చేప పిల్లలను విడు‌దల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు కుల వృత్తులను ప్రోత్సహించాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు.