విజయ డెయిరీ ద్వారా వేలాది మందికి ఉపాధి

విజయ డెయిరీ ద్వారా వేలాది మందికి ఉపాధి

హైదరాబాద్: విజయ డెయిరీ టర్నోవర్ ను 1000 కోట్లకు పెంచుతామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో విజయ డెయిరీకి చెందిన నూతన ఐస్ క్రీమ్ పుష్ కార్ట్ ( ట్రై సైకిల్స్ )  మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 2014 ముందు విజయ డెయిరీ వార్షిక టర్నోవర్ రూ. 400 కోట్లు మాత్రమేనని, కానీ అది ఇప్పుడు రూ.1000 కోట్ల వైపు దూసుకెళ్తుందన్నారు. విజయ డెయిరీ ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి గిరాకీ ఉందని, ఉత్పత్తులను మరింత పెంచడానికి 50శాతం సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. 

డెయిరీ ఉత్పత్తులను రాబోయే రోజుల్లో జిల్లాల్లో కూడా విస్తరించనున్నామని, దీంతో రవాణా ఖర్చులు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయ డెయిరీ ద్వారా వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రై సైకిళ్ల ద్వారా మరిన్ని అమ్మకాలు పెరెగే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. ఒక్క హైదరాబాద్ లోనే ఇంకా 35 లక్షల లీటర్ల పాలు అవసరమని, అందుకు అనుగుణంగా రైతులను పాడి వైపు వెళ్లేందుకు ప్రోత్సహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

ఇవి కూడా చదవండి..

అల్లు అర్జున్‌తో నటించాలని ఉంది

బిహార్లో ఏకంగా బ్రిడ్జినే దొంగిలించిన్రు