కార్మికులకు న్యాయం జరగాల్సిందే

కార్మికులకు న్యాయం జరగాల్సిందే

ఫిల్మ్ ఛాంబర్ కు, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ లు సమస్యను పరిష్కరించుకోవాలని  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఫెడరేషన్ సభ్యులు మంత్రి తలసానితో భేటీ అయ్యారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కరోనాతో వేతనాలు పెరగలేదన్నారు. రెండు వైపుల సమస్యలున్నాయని .. ఇరు వర్గాలు పంతాలు, పట్టింపులకు పోవద్దన్నారు. రెండు వర్గాలకు నాయ్యం జరగాలని మంత్రి తలసాని తెలిపారు. ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.