పాలమూరులో సామాజిక న్యాయ సభను సక్సెస్ చేయాలి : ఎస్.రమేశ్గౌడ్

పాలమూరులో సామాజిక న్యాయ సభను సక్సెస్ చేయాలి : ఎస్.రమేశ్గౌడ్

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : ఉమ్మడి మహబూబ్ నగర్ బీసీ ఇంటరలెక్చవల్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 11న పాలమూరులో జరిగే సామాజిక న్యాయ సభను సక్సెస్ చేయాలని ఫోరం కోర్ కమిటీ మెంబర్ ఎస్.రమేశ్​గౌడ్ పిలుపునిచ్చారు.  ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ రాబోయే మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను 42 శాతం రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చిన తర్వాతే నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

10 శాతం కూడా లేని ఓసీలకు బీజేపీ ప్రభుత్వం 10 శాతం ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు అన్యాయం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి  అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఫోరం స్టేట్ కో ఆర్డినేటర్ వేణుకుమార్ మాట్లాడుతూ బీసీ బహుజన ఉద్యమ చరిత్రలో మొదటిసారిగా 84శాతం సర్పంచ్​స్థానాలను కైవసం చేసుకోవడం చరిత్ర అన్నారు. 

బీసీ జేఏసీ చైర్మన్ బెక్కెం జనార్దన్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.  పాలమూరు సామాజిక న్యాయ సభను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా ఉన్న బహుజనులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర జాక్ కన్వీనర్ లక్ష్మీకాంత్ సారంగి, నాయకులు గోపాల్, వెంకటేశ్, రంగయ్య, కరుణాకరణ్​ తదితరులు పాల్గొన్నారు.