వనపర్తి, వెలుగు : ప్రజాభిప్రాయం మేరకు గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్‌ను నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యుడు జబ్బార్ డిమాండ్‌చేశారు. ఆదివారం సీపీఎం జిల్లా కమిటీ బృందం చీర్కపల్లి, గొల్లపల్లి, చెన్నారం, ఏదుల రిజర్వాయర్ ప్రాంతాలను పరిశీలించింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్‌కు లింకుగా చీర్కపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్ ను నిర్మించాలని ఆలోచిస్తోందని, మూడు గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు.
ప్రజాభిప్రాయానికి భిన్నంగా నిర్ణయం తీసుకుంటే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్ రెడ్డి, సభ్యుడు పరమేశ్వరా చారి, నాయకులు మండ్ల బాలస్వామి, రాజశేఖర్ పాల్గొన్నారు.
