సనత్ నగర్‭లో స్పోర్ట్స్ మీట్‭ను ప్రారంభించిన మంత్రి తలసాని

సనత్ నగర్‭లో స్పోర్ట్స్ మీట్‭ను ప్రారంభించిన మంత్రి తలసాని

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలోను రాణించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్‭లో ప్రైవేటు గుర్తింపు పొందిన పాఠశాల విద్యార్థుల స్పోర్ట్స్ మీట్‭ను మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్‭లో వెయ్యికి పైగా  విద్యార్థులు పాల్గొన్నారు. 

నిరంతరం తరగతి గదులు, పరీక్షలకు సిద్ధం కావడం వంటి ఒత్తిడుల నుంచి విద్యార్థులకు క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని చెప్పారు. క్రికెట్, కబడ్డీ, కోకో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించే విధంగా పోటీలను నిర్వహించడం పట్ల స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్‭ను మంత్రి తలసాని అభినందించారు.