జూబ్లీహిల్స్లో వ్యూహాత్మకంగా పనిచేయాలి: బూత్ లెవల్ కమిటీ సభ్యులతో మంత్రి తుమ్మల సమావేశం

జూబ్లీహిల్స్లో వ్యూహాత్మకంగా పనిచేయాలి: బూత్ లెవల్ కమిటీ సభ్యులతో మంత్రి తుమ్మల సమావేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం వ్యూహాత్మకంగా పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం బూత్ లెవల్ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సీడ్స్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి, కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగ రాఘవ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్ల కొత్వాల్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త, పాత అనే భేదాలు లేకుండా కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తెలియజేసి ఓటర్లలో చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రతి డివిజన్​లో జరిగిన అభివృద్ధి పనుల జాబితా సిద్ధం చేసి, ప్రజలకు చూపించాలని, అలాగే రాబోయే పీఏసీ సమావేశం కోసం సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు.