- మంత్రి తుమ్మల ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆడిట్లను వారంలోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశించారు. ప్రభుత్వ సహాయం లేకుండా నడిచే సహకార సంఘాల ఆడిట్లను జనవరిలోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
సోమవారం సెక్రటేరియెట్‌లో సహకార సంఘాల కార్యకలాపాలపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల్లో జరిగిన అవకతవకలపై కొనసాగుతున్న సెక్షన్ 51 ఎంక్వైరీలు, సెక్షన్ 52 పరిశీలనలు నిర్ణీత గడువులోగా పూర్తిచేసి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో ప్రభుత్వ న్యాయవాదులతో సమన్వయం చేసి త్వరగా పరిష్కారం చేసేందుకు చర్యలు తీసు కోవాలి. ప్యాక్స్ పనితీరును నిరంతరం పర్యవేక్షించాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనాలి. సగటు నాణ్యత ప్ర మాణాల ప్రకారం ధాన్యం కొనుగోలు జరగాలి. కొనుగోలు తర్వాత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి” అని మంత్రి పేర్కొన్నారు.
