
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన పెసర కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తేమశాతం నిర్ధారిత ప్రమాణం కంటే ఎక్కువగా ఉందన్నారు.
ఎఫ్ఏక్యూ ప్రమాణాల మేరకు ఉన్న పెసరకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట జిల్లా మార్క్ ఫెడ్ అధికారి సునీత, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య ఉన్నారు.
స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులకు శంకుస్థాపన
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని35వ డివిజన్ లో శనివారం టీయూ ఎఫ్ఐడీసీ నిధులతో నిర్మించనున్న స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులకు మంత్రి తుమ్మల శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సిటీ మేయర్ పూనకొల్లు నీరజ, నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, మిక్కిలినేని నరేందర్, బాలగంగాధర్ తిలక్, కార్పొరేటర్ తేల్లంపల్లి వెంకటరావు ఉన్నారు.
భారీ వర్షాలతో జాగ్రత్తగా ఉండాలి
భారీ వర్షాలతో జిల్లా అధికారులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎప్పటికప్పుడు జిల్లాలోని పరిస్థితులపై సమీక్షిస్తూ చర్యలు తీసుకోవాలని
ఆదేశించారు.