తమిళనాడు ఎలక్షన్ ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌‌‌‌‌‌‌‌గా మంత్రి ఉత్తమ్

తమిళనాడు ఎలక్షన్ ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌‌‌‌‌‌‌‌గా మంత్రి ఉత్తమ్
  •     ఐదు రాష్ట్రాలకు అబ్జర్వర్లను నియమించిన కాంగ్రెస్‌‌‌‌ అధిష్టానం

న్యూఢిల్లీ, వెలుగు: తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌‌‌‌‌‌‌‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, ఖాజీ మహ్మద్ నిజాముద్దీన్‌‌‌‌కు బాధ్యతలు అప్పగించింది. 

ఈ మేరకు బుధవారం ఏఐసీసీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అస్సాంకు సీనియర్ అజ్జర్వర్లుగా చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ మాజీ సీఎం భూపేశ్ బఘేల్, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బంధు తిర్కేను నియమించింది. కేరళ అసెంబ్లీ ఏఐసీసీ సీనియర్ పరిశీలకులుగా సచిన్ పైలట్, కేజే జార్జ్, ఇమ్రాన్ ప్రతాప్ ఘర్హీ, కన్నయ్య కుమార్‌‌‌‌‌‌‌‌ను నియమించింది.