- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ
గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ నరేశ్ జాదవ్ శనివారం హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిని మంత్రికి వివరించారు.
కుప్టి, చనాక-కొరాట ప్రాజెక్టుల నిర్మాణ పనులకు నిధుల మంజూరు, పనులు స్పీడప్ చేయాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు నరేశ్జాదవ్తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి ఉన్నారు.
