కేసీఆర్‌ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతుండు.. మంత్రి ఉత్తమ్ కౌంటర్

 కేసీఆర్‌ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతుండు.. మంత్రి ఉత్తమ్ కౌంటర్

కేసీఆర్‌ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌ డిప్రెషన్‌లో ఉన్నారని.. ఫ్రస్ట్రేషన్‌లో అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.   పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు ఉత్తమ్.   ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమేనని చెప్పారు.  

25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారంటూ కామెంట్స్ చేశారు మంత్రి ఉత్తమ్‌.  కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పిన మంత్రి... సీఎం రేవంత్  రెడ్డి నాయకత్వంలో విన్నింగ్ టీమ్‌గా పనిచేస్తున్నామని తెలిపారు.   సాగునీటి రంగాన్ని బీఆర్ఎస్ ధ్వంసం చేసిందని..   ఫోన్ ట్యాపింగ్‌కు గత ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కు 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని  ధీమా వ్యక్తం చేశారు.  

Also Read:సీఎం రేవంత్ సవాల్ ను స్వీకరించిన హరీశ్ రావు

మరోవైపు బీఆర్ఎస్ కు 8 ఎంపీ సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు .  కాంగ్రెస్ కు 12 ఎంపీ సీట్లు వస్తాయని, బీజేపీకి రెండు ఎంపీ సీట్లు వస్తాయన్నారు.  బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు.  తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారని దమ్ముంటే ఒక్క ఎమ్మెల్యే పేరు చెప్పాలన్నారు.  ఇప్పటికే నలుగురు బీఆర్ఎస్  ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని.. మరో 25 మంది చేరేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు.