హైదరాబాద్, వెలుగు: పదేండ్లు రాష్ర్టాన్ని కేసీఆర్ లూటీ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం తుక్కుగూడలో జరిగిన జనజాతర సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. ఇన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉండి, ఇప్పుడు ఎన్నికల కోసం బయటకు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కరెంట్, తాగు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎంతో సహా మంత్రులందరం నిత్యం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వాటర్ మేనేజ్ మెంట్ సరిగా జరగలేదన్నారు. తెలంగాణకు మోదీ ఏం చేయలేదని.. బీజేపీకి ఓటు అడిగే హక్కు, అర్హత లేదని అన్నారు.