హామీలు నెరవేర్చడంలో కేంద్రం విఫలం : ఉత్తమ్ కుమార్​రెడ్డి 

హామీలు నెరవేర్చడంలో కేంద్రం విఫలం : ఉత్తమ్ కుమార్​రెడ్డి 
  •     మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి 

నడిగూడెం (మునగాల), వెలుగు : తెలంగాణ రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి విమర్శించారు. మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలోని కొల్లుకోటయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన నడిగూడెం, మునగాల, మోతే మండలాల పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మోసగిస్తూ మళ్లీ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యిందన్నారు. ఎన్నికల్లో రూపాయికారి ఒప్పందం చూసుకొని కాంగ్రెస్​ ఓడించేందుకు కుట్ర చేస్తున్నారన్నారని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే వెలమాల పద్మావతిరెడ్డి, రాష్ట్ర కమిటీ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జడ్పీటీసీ బాణాల కవితతోపాటు నాయకులు పాల్గొన్నారు.