కాళేశ్వరం, మేడిగడ్డపై విచారణ చేస్తాం : మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం, మేడిగడ్డపై విచారణ చేస్తాం : మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీల్లో జరిగిన అవకతవకలు, నష్టాలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డిసెంబర్ 11వ తేదీ సోమవారం నగరంలోని  జలసౌదలో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు వెల్లడించారాయన. ఇరిగేషన్ శాఖపై అధికారులతో సమీక్ష తర్వాత.. కీలకమైన అంశాలు, వివరాలను మీడియాకు వెల్లడించారు మంత్రి ఉత్తమ్.  

మంత్రి ప్రెస్ మీట్ పాయింట్స్:

  • రాష్ట్రంలో నీటిపారుదల శాఖది కీలక పాత్ర,  నీటి వాటా విషయమై కేంద్రంతో చర్చిస్తాం. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.
  • మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగడంపై అధికారులు వివరణ ఇచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్ట్  నిర్మాణానికి రూ.4600 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెప్పారు. ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగిందని.. మరో మూడు పిల్లర్లపై ఆ ప్రభావం పడిందని తెలిపారు.
  • ప్రమాదానికి ముందు రోజు సాయంత్రం.. పిల్లర్స్ కుంగిన వెంటనే ప్రాజెక్ట్ లో నీటిని తీసేసినట్లు అధికారులు చెప్పినట్లు స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
 
  • మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై విచారణకు ఆదేశిస్తాం. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం.
  • గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో గోప్యత, రహస్య జీవోలు, అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇరిగేషన్ శాఖలో పారదర్శకత ఉండాలి
  • త్వరలో మెడిగడ్డ, సీతారామ ప్రాజెక్టులు సందర్శిస్తా
  • 40వేల చెరువుల నిర్వహణ గురించి  మా ప్రభుత్వం శ్రద్ద పెడుతుంది.  
  •  చెరువుల నిర్వహణలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించాం.
  • కొత్త ఆయకట్టు వివరాలు ఇవ్వమని అధికారులను కోరాం.
 
  • కోట్లాది ప్రజలు విశ్వాసంతో ముడిపడి ఉన్న అంశం...అంతా పారదర్శకంగా జరుగుతుంది 
  • తమ్మడిహెట్టి ప్రాజెక్ట్ నిర్మాణం  గురించి ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం 
  • ఎస్ఎల్ బిసి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం