కేసీఆర్ , జగన్ దోస్తీ.. పోతిరెడ్డిపాడు నుంచి జల దోపిడీ : మంత్రి ఉత్తమ్

కేసీఆర్ , జగన్ దోస్తీ.. పోతిరెడ్డిపాడు నుంచి జల దోపిడీ : మంత్రి ఉత్తమ్


అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ దోస్తీ వల్లే.. పోతిరెడ్డిపాడు నుంచి జల దోపిడీ జరిగిందన్నారు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. పదేళ్లు అధికారంలో ఉండగానే.. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెరిగిందన్నారు. 2020లో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 92 వేల 500 క్యూసెక్కులకు పెంచుతూ.. ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయాన్ని అసెంబ్లీలో జీవోలు చూపిస్తూ.. వివరించారు మంత్రి ఉత్తమ్. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి.. తెలంగాణ నీళ్లను రాయలసీమకు అక్రమంగా.. దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్.

ఏపీ సీఎం జగన్ తో దోస్తీ చేసిన కేసీఆర్.. వీళ్లిద్దరూ గంటలు గంటలు సుదీర్ఘంగా చర్చించుకున్నారని.. వీరి భేటీ జరిగినప్పుడల్లా.. కృష్ణా జలాలను అక్రమంగా.. అదనంగా ఎత్తుకెళ్లారని స్పష్టం చేశారాయన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే.. తెలంగాణ నీళ్లను.. 50 శాతం అదనంగా దోచుకెళ్లారని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్.

also read : 299 టీఎంసీలకు.. ఏడేళ్లు వరుసగా ఎలా ఒప్పుకున్నారు : మంత్రి ఉత్తమ్

వైఎస్ హయాంలో 11 వేల 500 క్యూసెక్కులుగా ఉన్న పోతిరెడ్డిపాడు సామర్థ్యం.. కేసీఆర్, జగన్ దోస్తీ తర్వాత.. ఏకంగా 92 వేల 500 క్యూసెక్కులకు పెరగటాన్ని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్. ఇది దారుణమైన విషయం అని.. తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఏపీలో కంటే.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఏపీ సీఎం జగన్ దోస్తీతో.. తెలంగాణ రైతులకు తీరని అన్యాయం చేశారంటూ పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసెంబ్లీలో వివరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.